
ఢాకా: కొన్ని రోజులుగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపిఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాడైన ముస్తాఫిజుర్ రెహమన్ నుంచి తప్పించారు. దీంతో బంగ్లాదేశ్ త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడమని నిర్ణయం తీసుకుంది. ఈ మేరక ఐసిసికి లేఖ రాసింది. కానీ, ఐసిసి మాత్రం అందుకు అంగీకరించలేదు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌ు కోల్‌కతా, ముంబై వేదికగా జరగాలి. అయితే వాటిని చెన్నై, తిరువనంతపురంలో ఆడాలని ఐసిసి సూచించింది.
అయితే బంగ్లాదేశ్ దీన్ని కూడా తిరస్కరించినట్లు సమాచారం. తాజాగా ఐసిసి ప్రతినిధులతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధలుతో జరిగిన సమావేశంలో బంగ్దాదేశ్, భారత్‌లో క్రికెట్ ఆడేందుకు అంగీకరించలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ వెలుపల ఉన్న వేదికలకు మార్చాలని బిసిబి, ఐసిసిని మరోసారి కోరింది. అయితే టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారు కావడం.. జట్లకు విమాన, హోటల్ గదుల టికెట్లు బుక్ చేయడంతో బిసిబితన వైఖరిని పునఃపరిశీలించుకోవాలని ఐసిసి విజ్ఞప్తి చేసింది. కానీ, బంగ్లాదేశ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.