
2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనను ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేకపోతున్నారు. తాజాగా ఈ ఘటనపై ఓ సినిమా రూపొందింది. ‘మర్డర్స్ టూ క్లోజ్, లవ్ టూ ఫార్’ అనేది ఈ సినిమా టైటిల్. ఇజ్రాయెల్ డైరెక్టర్ డాన్ వోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అస్సాంకు చెందిన మంజు బోరా ఈ సినిమాకు కో-డైరెక్టర్‌గా పని చేశారు. పుణె అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ో ఈ సినిమాని ఈ నెల 17, 19వ తేదీల్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయంపై డాన్ వోల్మన్ మాట్లాడుతూ.. తమ చిత్రం పుణె అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అంగీకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 19న (సోమవారం) ఈ సినిమా చూసేందుకు తాను స్వయంగా వస్తానని పేర్కొన్నారు.