
తప్పు ఒప్పుకున్న ఎలాన్ మస్క్
600 ఖాతాలు తొలగింపు
3500 పోస్టులు బ్లాక్
డబ్బు చెల్లించిన సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ పరిమితం
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ మద్దతు గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) -ఏఐ చాట్ బాట్ గ్రోక్ కు సంబంధించి అశ్లీల కంటెంట్ ఉందని ఎక్స్ అంగీకరించింది. ఈ అశ్లీల కంటెంట్ పై భారత ఐటీ మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేయడంతో ఎక్స్ తన తప్పున్ అంగీకరించి దాదాపు 3,500 కంటెంట్ అం శాలను తొలగించింది. అలాగే 600 ఖాతాల ను తొలగించిందని ప్రభుత్వ వర్గాలు ఆదివా రం తెలిపాయి. అంతే కాదు ఇక ముందు కూ డా భారత చట్టాలను పాటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అసభ్యకరమైన చిత్రాలను చిత్రీకరణకు తోడ్పడుతున్న ఏఐ ఇంజిన్ గ్రోక్ పై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుంచి ఫిర్యాదు లు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఎక్స్ తన తప్పును అంగీకరించడమే కాక, భారతీయ చట్టాలను పాటించి తీరతామని హామీ ఇచ్చింది.
వెంటనే 3,500 కంటెంట్ అంశాలను తొలగించడంతోపాటు 600 ఖాతాలను తలగించి, మున్ముందు ఎలాంటి అశ్లీల చిత్రాలను అనుమతించబోమని కూడా హామీ విశేషం. చట్ట విరుద్ధమైన కంటెంట్ విషయంలో ఎలాన్ మస్క్ తీసుకున్న స్పష్టమైన వైఖరిని ప్రతిబింబిస్తూ, ఇక ముందు ఎవరైనా గ్రోక్ ను చట్టవిరుద్ధమైన కంటెంట్ ను ఉపయోగించేలా, లేదా తయారు చేసేందుకు యత్నించినా, అశ్లీల కంటెంట్ అప్ లోడ్ చేసినా, ఇలాంటి పరిమామాలే ఎదుర్కొంటారని సోషల్ మీడియా ఎక్స్ స్పష్టం చేసింది. క్స్ కు చెందిన ఏఐ చాట్ బాట్ గ్రోక్ లో యూజన్ ప్రాంఫ్ట్ ల ద్వారా చిత్రాలను సులభంగా నగ్నంగా చిత్రీకరించేందుకు వినియోగించడంతో ప్రపంచ వ్యాప్తం గా వ్యతిరేకత వ్యక్తమైంది.
జనవరి 2న భారత ఐటీ మంత్రిత్వశాఖ ఎక్స్ పై కేసు నమోదు చేసి, గ్రోక్ సృష్టించిన అన్ని అసభ్యకరమైన,అశ్లీలమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ ను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు 72 గంటలలో స్పష్టమైన చర్య తీసుకుని , వివరాలతో నివేదిక ను సమర్పించాలని మంత్రిత్వశాఖ సోషల్ మీడియా సంస్థను ఆదేశించింది. ఇక ముందు భారతీయ చట్టాల ప్రకారం కంటెంట్ ఉండేలా చూసుకోవాలని కూడా స్పష్టం చేసింది.