
తెలంగాణ రాష్ట్రం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా పనిచేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటి-పరిశ్రమలు శాఖ మంత్రి కెటిఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్‌లో ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌ను ఆహ్వానించారు. ‘ద ఇండియా వి ఇమాజిన్’ అనే థీమ్‌తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల కాన్ఫరెన్స్‌లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. భారత్‌తో పాటు దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి వెయ్యిమందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ,
ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టడంలో కెటిఆర్ పోషించిన కీలక పాత్రకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నది. హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్ విస్తరణ, స్టార్టప్ సంస్కృతి అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, అర్బన్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఆధారిత ఉద్యోగాల సృష్టి వంటి రంగాల్లో కెటిఆర్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌లో మొదటి రోజు (ఫిబ్రవరి 14) హార్వర్డ్ కెనెడీ స్కూల్‌లో పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీపై, రెండో రోజు (ఫిబ్రవరి 15) హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో వ్యాపారం, ఆంత్రప్రెన్యూర్‌షిప్, గ్లోబల్ ఎకానమీపై చర్చలు జరగనున్నాయి. రెండో రోజు ప్రసంగించాలని నిర్వాహకులు కెటిఆర్ కోరారు. గతంలో ఈ వేదికపై నీతా అంబానీ, నితిన్ గడ్కరీ, అజీమ్ ప్రేమ్‌జీ, అజయ్ బంగా, జైరాం రమేష్, రాధికా గుప్తా, కరిష్మా కపూర్, సబ్యసాచి వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ప్రసంగించారు.