Reading Time: < 1 minute

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గన్ మెన్ కృష్ణ చైతన్య తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు… 2020 బ్యాచ్ కు చెందిన ముత్యాలపాయటి కృష్ణ చైతన్య అనే ఎఆర్ కానిస్టేబుల్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూర్ గ్రామంలోని సూర్యనగర్ లో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లోనే తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం  చేసుకున్నాడు. వెంటనే అతడిని కామినేని  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆత్మహత్యాయత్నానికి ఆర్థిక సమస్యలే కారణమని పోలీసుల భావిస్తున్నారు. చైతన్య గత కొంతకాలంగా అప్పులు, ఆర్థిక ఒత్తిడితో మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.