Reading Time: < 1 minute

అడిలైడ్: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3-0 తేడాతో ఈ సిరీస్‌లో ఆసీస్ గెలుపొందింది. చివరి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 352 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఆ జట్టు ఓటమిని  చవిచూసింది. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో భారీ హాఫ్ సెంచరీ చేయడంతో అలెక్స్ కారేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 371

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 349

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 286

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 352