Reading Time: < 1 minute

దక్షిణ సూడాన్‎లో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

Caption of Image.

జుబా: దక్షిణ సూడాన్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దేశ రాజధాని జుబా శివార్లలో సోమవారం (ఏప్రిల్ 27) ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, పైలట్ మరణించారని దక్షిణ సుడాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది. 

జూబాకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగగా.. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో ఇద్దరు కెన్యా జాతీయులు ఉండగా.. మిగిలిన వారు దక్షిణ సూడాన్‌కు చెందినవారని అధికారులు వెల్లడించారు. 

నిపుణుల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

 

©️ VIL Media Pvt Ltd.