Reading Time: < 1 minute

ఢిల్లీని కమ్మేసిన భారీ దుమ్ము తుఫాన్..ఉక్కిరిబిక్కిరి అయిన జనం

Caption of Image.

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ దుమ్ము తుఫాన్ కప్పేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరమంతా దుమ్ము తుఫాన్ కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక నానా తంటాలు పడ్డారు. 

సోమవారం రాత్రి జాతీయ రాజధాని ఢిల్లీ అంతటా భారీ ఉరుములతో కూడిన దుమ్ము తుఫానులు, అధిక వేగంతో గాలులు వీచాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులైతే రహదారులు కనపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ దూరం రోడ్డు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. 

మధ్య పాకిస్థాన్, వాయువ్య రాజస్థాన్, పంజాబ్ ,హర్యానాలపై కొనసాగుతున్న తుఫాను వలయం కారణంగా ఢిల్లీలో ఈ మార్పు సంభవించిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వలయం దేశంలోని ఈశాన్యం వైపు కదులుతూ, రాజస్థాన్ నుంచి దుమ్ము, ఇసుకను తీసుకువస్తోందని ఆ ప్రాంతంలో దుమ్ము తుఫానులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

మరోవైపు ఏప్రిల్ 30 వరకు ఉరుములు, వానలు, ధూళి తుఫానులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అంచనా వేసింది. ఏప్రిల్ 29వ తేదీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా సోమవారం జాతీయ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.1 డిగ్రీలు అధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

©️ VIL Media Pvt Ltd.