
ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ప్రత్యర్థుల గుండల్లో గుబులు పుట్టేది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు గత సీజన్ నుంచి అత్యంత చెత్తగా ఆడుతుంది. 2025 సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే టేబుల్ చివరిస్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్ కూడా వరుస ఓటములతో సిఎస్‌కె సతమతమవుతుంది. గత సీజన్‌లో రుతురాత్‌కు గాయం కావడంతో ధోనీని కెప్టెన్ చేశారు. కెప్టెన్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ధోనీ కూడా సిఎస్‌కెని గట్టెుక్కించలేకపోయాడు.
అయితే ఈ సీజన్‌ల ఆరంభానికి ముందే సిఎస్‌కెకి షాక్ తగిలింది. గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ధోనీ శనివారం ఢిల్లీతో సొంత మైదానం చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వస్తాడని అంతా భావించారు. అతడు ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకాబోతున్నట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్‌కి కూడా ధోనీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ క్రీడా వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ధోనీ కోలుకొని ఫిట్‌నెస్ సాధించడానాకి ఇంకావారం రోజులు సమయం పడుతుందిని తెలుస్తోంది. కెకెఆర్‌తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్‌తో ధోనీ జట్టులోకి వస్తాడని సమాచారం.