
అమరావతి: ఓ రైతు వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు దొంగలించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో జరిగింది. ఓ రైతు ఐదు లక్షలు రూపాయలు అప్పుగా తీసుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. జొన్నలగడ్డ బైపాస్ వద్ద స్కూటీని ఆపి ఉల్లిగడ్డలు కొనడానికి షాపుకు వెళ్లాడు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించాడు. అనంతరం స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.