
బయటకు భోజనం చెద్దామని నమ్మబలికి యువకుడిని ఇంట్లో నుండి తీసుకువెళ్లిన అతని స్నేహితులు పాత కక్షలను మనసులో పెట్టుకొని యువకుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. షాహీన్‌నగర్‌లో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా జీవనం కొనసాగిస్తున్న మహ్మద్ నసీర్(22)ను ఈనెల 5వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో హోటల్‌లో భోజనం చెద్దాం అంటూ అతని స్నేహితులు మహ్మద్ దస్తగిరి,మహ్మద్ సుభానుద్దీన్‌లు హోండా యాక్టివా ద్విచక్రవాహనంపై ఇంటి నుండి తీసుకువెళ్లారు.కాగా అదేరోజు అర్ధరాత్రి సుమారు 12:45 గంటల సమయంలో షాహీన్‌నగర్‌లోనే నివసించే
మరో యువకుడు నసీర్ మేనమామ మహ్మద్ ఆరిఫ్ వద్దకు వచ్చి వాదే హీ సాలెహీన్ ప్రధానరోడ్డుపై గల హబీబ్ హోటల్ వద్ద గల ఖాళీస్ధలంలో నసీర్ మరణించి ఉన్నాడని సమాచారం ఇచ్చాడు,దీంతో హుటాహుటిన సంఘటనస్ధలానికి చేరుకున్న ఆరిఫ్ అతని మేనల్లుడు నసీర్ మెడ,నడుంలపై 5,6 కత్తిపోట్లకు గురికావడంతో పాటు తలపై సిమెంట్ రాయితో బలంగా మోదడంతో రక్తం మడుగులో పడి మృతిచెందినట్లుగా గుర్తించాడు.అనంత రం 6 న మధ్యాహ్నం మహ్మ ద్ దస్తగిరి,మహ్మద్ సుభానుద్దీన్,మహ్మద్ ఇలియాస్, మ హ్మద్ నదీంఖాన్‌లు తన మేనల్లుడితో ఉన్న పాతకక్షలను మనసులో పెట్టుకొని అతనిని హత్యం చేశారని పేర్కొంటూ ఆరిఫ్ తమకు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.