Reading Time: < 1 minute

ఐపిఎల్ సీజన్ 2026లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచిన కోల్‌కతా టాస్ ఎంచుకుంది. అయితే కోల్‌కతా స్కోరు 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. అంతేగాక వర్షం తగ్గక పోవడంతో ఆటను నిలిపి వేశారు.

పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ఒకవేళ వర్షం తగ్గితే కనీసం ఐదు ఓవర్ల పాటు ఆటను కొనసాగించాలని భావిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆట ప్రారంభమవుతుందా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవేళ వర్షం ఆగిపోయి మైదానం ఆటకు అనుకూలంగా మారితే ఇరు జట్లకు ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది.