
కేరళలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కి ఓటువేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఇంటింటి ప్రచారం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి సీతక్క వెంట కేరళ ఎన్నికల ప్రచారంలో ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఆయా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు ఉన్నారు.