
తుగ్లక్ కేసీఆర్ వల్ల సింగరేణి సంస్థ ఆగమైందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం ( ఆగస్టు 4 ) మందమర్రి బీ1 ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. కేసీఆర్ హయాంలో కొత్త గనులు, ఉద్యోగాలు రాకపోవడంతో కార్మికుల శాతం తగ్గిందని అన్నారు మంత్రి వివేక్. బొగ్గు నిక్షేపాలు ఉన్న చోటనే కొత్త గనులు తీసుకురావాలని.. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ సర్కార్ కృషి చేస్తోందని అన్నారు మంత్రి వివేక్.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మణుగూరు,తాడి చర్ల -2,ఆర్కే ఓపెన్ కాస్ట్ గనులను తీసుకొచ్చామని… అధికారం కోల్పోయాక కేటీఆర్ ఫ్రస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు మంత్రి వివేక్. రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుకు 70 టిఎంసీల నీరును 100 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేస్తేనే 3వేల కరెంట్ బిల్లు కట్టింది గత బిఆర్ఎస్ సర్కార్ కాదా అని ప్రశ్నించారు.
హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసి మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నానని… గత ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు నియోజక వర్గ అభివృద్ధికి పాటు పడితే నేను ఎమ్మెల్యేగా గెలుపొందకా వందల కోట్ల తో అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతున్నాయని అన్నారు మంత్రి వివేక్.
కాకా వెంకటస్వామి,గడ్డం వినోద్ హయంలో జైపూర్ పవర్ ప్లాంట్ ను తీసుకొచ్చి 5వేల ఉద్యోగాలు కల్పించారని అన్నారు. చెన్నూరు నియోజక వర్గంలో సీఎస్ఆర్,డీఏంఎఫ్టీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్స్, ఖభరస్తాన్ లు,షాదిఖాన ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ను ఆదేశించానని అన్నారు మంత్రి వివేక్. ప్రజా సమస్యలు,మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీ వేస్తున్నామని అన్నారు.