Reading Time: 2 minutes
Tollywood : హీరో మెటీరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బెనర్జీ. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు. తనను చాలా మంది “హీరో మెటీరియల్” అని భావించేవారని, మంచి హైట్, వెయిట్, అందం ఉన్నాయని అనేవారని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన పాత్రలకు, తన కెరీర్ జర్నీకి సంబంధం లేకుండానే ఇండస్ట్రీలో కొనసాగానని కొందరు అంటుంటారని వివరించారు. తన తండ్రి గొప్ప నటుడని, విలన్ అని, తనకన్నా ఆయన సూపర్ స్టార్ అని బెనర్జీ కొనియాడారు. మురళీమోహన్ గారు కూడా తాను హీరో కావాల్సింది అని చాలాసార్లు అనేవారని గుర్తు చేసుకున్నారు. అయితే, తనకు నటుడిని కావాలనే గానీ, ఏదైనా సాధించాలనే తపన గానీ, ఆ ఫైర్ గానీ ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిమ్ లేకపోవడం, కేవలం సంతోషంగా ఉండాలని కోరుకోవడం వల్లనే తన కెరీర్ ఇలా సాగిందని తెలిపారు. వచ్చిన దాంతో ఎక్కువ సంతృప్తి చెందానని, అదే తన సినీ జీవితానికి కారణం కావచ్చునని బెనర్జీ అన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

బెనర్జీ మాట్లాడుతూ, తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సినీ నిర్మాణంలోని కెమెరా, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, నటులు, ప్రొడక్షన్ వంటి వివిధ విభాగాలను నిశితంగా గమనించే అవకాశం లభించిందని తెలిపారు. ఈ అవగాహనతో పెద్ద నటులతో కలిసి పని చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా సులభంగా నటనను పండించగలిగానని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం ఉన్నవారికి నటులుగా మారినప్పుడు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఈ విషయం కేవలం నటులకు మాత్రమే కాదని, సినీ పరిశ్రమలోని ఏ విభాగంలోనైనా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

నాని గారి కెరీర్‌లో కూడా ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని బెనర్జీ గుర్తు చేశారు. కెమెరా, లైటింగ్, ఆర్ట్ వంటి విభాగాలపై ఆచరణాత్మక అవగాహన, వాటిలో పని చేసే విధానంపై జ్ఞానం సినీ రంగంలో రాణించడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు. ఇది నటనలో పట్టు సాధించడానికి, అన్ని విభాగాల పనితీరును అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..