
టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో, గంభీరమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఆయన అకస్మాత్తుగా దివంగతులయ్యారనే వార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుదీర్ఘ కాలం పాటు పలు భాషల్లో విభిన్న పాత్రలు పోషించిన ఈ దిగ్గజ నటుడి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఎలా చనిపోయారు? అసలు ఆయన చనిపోయారా? లేదా అనే విషయం మీద ఇప్పటికి పూర్తి క్లారిటీ అయితే లేదు. ఆయన చనిపోయినట్టు ఆయన ఇంగ్లీష్ WIkipedia పేజీలో అప్డేట్ చేశారు. ఇక ఈ మరణం ఆయన కుటంబ సభ్యులు ద్రువీకరించాల్సి ఉంది. నెట్లో అయితే ఆయన ఏడు నెలల క్రితం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నట్టు ఒక టెస్టిమొనల్ వీడియో ఉంది.

హిందీలో బి.ఆర్. చోప్రా ‘మహాభారత్’ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో తన నట జీవితాన్ని ప్రారంభించి, ‘లాగాన్’, ‘సర్ఫరోష్’ వంటి సూపర్ చిత్రాల్లో నటించారు. అనంతరం నేపాలీ చిత్రసీమలో ‘ఎ బాట ఆమ’, ‘హ్రస్వ దీర్ఘ’ వంటి సినిమాలతో ఇతర దేశాలలోనూ ప్రేక్షకుల ఆదరణ పొందారు. ప్రదీప్ రావత్ అనగానే అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటనలో కనిపించే విలక్షణ శైలి గుర్తుకొస్తాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో విలన్ పాత్రలతో పాటు ఎన్నో గుర్తుండిపోయే సహాయ నటుడి పాత్రల్లో జీవించారు. ఒక వైపు భయం గొలిపే విలన్‌గా మెప్పిస్తూనే, మరోవైపు నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘సై’లో ఆయన పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత గుర్తింపు పొందిన విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచింది. ఆ పాత్రలో ఆయన చూపించిన గంభీరత్వం, నటనకు గాను ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత ఛత్రపతి & భద్ర, గజినీ , స్టాలిన్ , దేశముదురు, సరైనోడు , వాల్తేరు వీరయ్య తన విశిష్ట నటనా ప్రతిభను ప్రదర్శించారు.