Reading Time: 2 minutes
Actress Sada: పామును కాపాడి అడవిలో వదిలిన టాలీవుడ్ హీరోయిన్.. ఫిదా అవుతోన్న నెటిజన్లు.. వీడియో ఇదిగో

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సదా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జయంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తనదైన అందం, అభినయంతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం వెండితెరపైన కాదు ఢీ వంటి టీవీ షోలతో బుల్లితెర ఆడియెన్స్ కు కూడా చేరువైందీ అందాల తార. అయితే ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటోంది సదా. వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమున్న ఆమె నిత్యం అడవుల్లో తిరుగుతూ ఎన్నో రకాల పక్షులు, జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అంతేకాదు వాటి సంరక్షణ కోసం తనవంతూ కృషి చేస్తోంది. తాజాగా ఆమె ఓ పాముని రక్షించి అడవిలో వదిలి పెటటింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

 

‘కొన్ని ప్రయాణాలు మనకు ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తాయి. మరికొన్ని జీవితం పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తాయి. త్రిపుర పర్యటన‌ నాకు ఆ రెండింటినీ ఇచ్చింది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్న ఈ రాష్ట పర్యటన నా జీవితంలో ఎప్పటకీ మర్చిపోలేను. యానిమల్‌ ఎయిడ్‌ అలయెన్స్‌ అనే స్వచ్ఛంధ సంస్థ పాములను కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. నా పక్కన నిలబడిన ఈయన డాక్టర్ గౌతమ్ మల్లిక్. వృత్తిరీత్యా డెంటిస్ట్.. కానీ ఆస్పత్రి సమయం ముగిశాక పాములను సంరక్షించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ఆయనొక్కరే కాదు ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులందరూ పాముల సంరక్షించేందుకే ఏకమయ్యారు. ఒక్క జూన్ నెలలోనే ఈ స్వచ్చంధ సంస్థ 295 పాములను రక్షించింది. ఇప్పుడు వారితో పాటు వెళ్లే అదృష్టం నాకు కలిగింది. అలా రక్షించబడిన పాములలో ఒకటైన, అందమైన, విషరహిత జాతి ఇండో-చైనీస్ రాట్ స్నేక్‌ను తిరిగి అడవిలోకి వదిలివేయడంతో నా మనసు పులకించిపోయింది. అది అడవిలో కలిసిపోవడాన్ని చూడటం కేవలం ఆ పాముకు విముక్తి కలిగించడమే కాదు, ప్రతి జీవికి తన సొంత ప్రదేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉండాలనే విషయాన్ని గుర్తు చేసినట్లు అనిపించింది’ అని సదా రాసుకొచ్చింది.

వీడియో ఇదిగో..

సదా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ సదా ధైర్యాన్ని అంతకు మించి మూగజీవాల సంరక్షణ కోసం ఆమె చేస్తోన్న కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి