
సన్నబియ్యంతో విందు భోజనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో సన్నంబియ్యంతో వండిన విందు భోజనాన్ని వడ్డించనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3.39 కోట్ల మందికి దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీన మధ్యాహ్నాం ఒంటిగంటకు ఈ విందు భోజనం నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.