
విద్యార్థులు న్యాయం కావాలని అడిగితే.. క్షమిస్తున్నానని ప్రధాని మోదీ వీడియోలు చేస్తున్నారు. క్షమించడానికి ఆయనెవరు.. విద్యార్థులకు కావాల్సింది న్యాయం. క్షమాపణలు కాదని అన్నారు రాహుల్ గాంధీ. మంగళవారం (ఆగస్టు 04) డీఎండీకే జనరల్ సెక్రటరీ వైకో రచించిన వైకో ఇన్ పార్లమెంటు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటి సమయంలో మనం ఉన్నామని అన్నారు. విద్యార్థులు రోడ్లెక్కారు. ఉద్యోగాలు అడుగుతున్నారు. అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలంటున్నారు. విద్యావ్యవస్థలో మార్పు కోరుతున్నారు.
కానీ మరోవైపు ప్రధాని మోదీ.. విద్యార్థులను క్షమిస్తున్నానంటూ వీడియోలు చేస్తున్నారు. క్షమించడానికి ఆయనెవరు అంటూ ప్రశ్నించారు. భారత భవిష్యత్తును క్షమించడానికి ఆయనకు ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తోంది అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ నియంతలా మారిపోయారు.. ఆయన వెనుక ఆరెస్సెస్ ఉంది.. ఆరెస్సెస్ బాటలోనే ఆయన నడుస్తున్నారని అన్నారు.
ALSO READ : E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కలుషితం.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులకు నష్టం
వైకో పుస్తకాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి ఆవిష్కరించిన రాహుల్.. ఈ సందర్భంగా వైకోకు అభినందనలు తెలిపారు.
We are living through a strange period in our country.
Students are on the streets. They are demanding jobs, fair examinations, and an education system that works.
And on the other side, we have a Prime Minister who is forgiving them.
👉 Who is he to forgive them?
👉 Where… pic.twitter.com/vju8gOQ3AT
— INC TV (@INC_Television) August 4, 2026