
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. ఎస్టీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టింది మానవహక్కుల కమిషన్.
ఫుడ్ పాయిజన్ కు దారి తీసిన పరిస్థితులు, అస్వస్థతకు గురైన విద్యార్థినుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన చికిత్స, హాస్టల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, పారిశుధ్యంపై నిర్వహించిన విచారణ, తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. సెప్టెంబర్ 7న నివేదిక సమర్పించాలని ఆదేశించింది మానవహక్కుల కమిషన్.
స్కూల్ల్ లోని స్టూడెంట్లు ఆదివారం ఉదయం చపాతి, మధ్యాహ్నం చికెన్ బగార రైస్, రాత్రి బెండకాయ టమాట, సాంబార్ తిన్నారు.
అనంతరం స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన సిబ్బంది మందులు ఇచ్చారు. సోమవారం ఉదయమైనా తగ్గకపోవడంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
ALSO READ : E20 పెట్రోల్ బంద్ చేస్తారా లేదా..
ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వరంగల్ జెడ్పీ సీఈవో రాంరెడ్డి, వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్్సగర్, డీటీడీవో నారాయణరెడ్డి స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ ను తనిఖీ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాస్పిటల్ కు వచ్చి స్టూడెంట్లతో మాట్లాడారు.
హాస్టల్ ను సందర్శించిన ఆయన డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, హాస్టల్ లో వాటర్ శాంపిల్ ను సేకరించినట్లు చెప్పారు. బీజేపీ మండల అధ్యక్షుడు అడుప రాజు సైతం స్టూడెంట్లను పరామర్శించారు.