Reading Time: < 1 minute

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర‌ప్రదేశ్‌కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీ పరిహారం అందినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ భూమల రైతుల జీవితాలు రాత్రికి రాత్రే బంగారు మయం అయ్యాయని పలు నివేదికల సమాచారం.

ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతుకు దాదాపు రూ.15 కోట్లు పరిహారం లభించింది. ఈ భారీ సొమ్ము ఆయన ఏకంగా ఒక హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, విహార యాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖ చిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి.