Reading Time: < 1 minute

స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

స్కిల్ డెవలప్మెంట్లో  తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని అన్నారు  కార్మిక, గనుల, ఉపాధి శాఖ  మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రజా పాలన ప్రభుత్వం ఒక విజన్ తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగలవారం (ఆగస్టు 04) మంచిర్యాల జిల్లా మందమర్రి బి1 కార్యాలయంలో  రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

 మందమర్రి ATC సెంటర్ లోజర్మని లాంగ్వేజ్ శిక్షణ పొందుతున్న  సెకండ్ బ్యాచ్ యువతతో ముచ్చటించి  పలు సూచనలు చేశారు. టామ్ కాం సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ.. విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. TOMCOM తో నిరుద్యోగ యువతలో మార్పు వస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. 

జర్మనీ, జపాన్, సౌదీ దేశాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ లో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మందమర్రి లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారత దేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. 

దేశంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఒక్కొక్క క్లస్టర్లను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే… తెలంగాణకు నాలుగు క్లస్టర్లను కేటాయించినట్లు గుర్తు చేశారు. ఒక్కొక్క క్లస్టర్ కు రెండు వందల కోట్ల చొప్పున నాలుగు క్లస్టర్లకు 800 కోట్లను కేంద్రం ప్రభుత్వం కేటాయించిందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. 

ALSO READ : E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కలుషితం..

జపాన్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయిని.. సివిల్,  ఎలక్ట్రికల్ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు.  జపాన్ స్కిల్డ్ యూత్ ను ఆహ్వానిస్తుందని చెప్పారు.  జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పిన మంత్రి..  ఆదేశ స్థితిగతులు ఉపాధి అవకాశాలు పరిశీలిస్తానని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.