Reading Time: < 1 minute
Udhayanidhi Stalin Arrest Vijay Government Action Sparks Political Storm In Tamil Nadu

Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రతీకారం కొత్త కాదు. ఒకరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించడం పరిపాటి. గతంలో జయలలిత, కరుణానిధి కూడా ఇలా అరెస్టైన వారే. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు వచ్చింది. 1996లో కలర్ టీవీ కుంభకోణంలో జయలలితను అరెస్టు చేశారు. 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణలపై జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పుడు, 2026లో కావేరీ ర్యాలీ సందర్భంగా త్రిష గురించి ఉదయనిధి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం విజయ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయనిధి అరెస్ట్ తర్వాత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ ముఖ్యులతో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ఉదయనిధిని వెంటనే రిలీజ్ చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పింది.

ఈ అరెస్ట్ ద్వారా విజయ్ డీఎంకేకు క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అయింది. ఏది పడితే అది మాట్లాడితే అరెస్టులు తప్పవని, తాను కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇలాంటి విషయాల్లో రాజీ పడేది లేదని ఒక సంకేతం ఇచ్చినట్లు అయింది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే అధినేతలైన కరుణానిధి, జయలలిత అరెస్టులు జరిగినట్లే, ఉదయనిధి అరెస్ట్ కూడా జరిగింది. చెన్నైలోని అతడి ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తంజావూర్ తరలించారు. తన భర్త టాయిలెట్‌లో ఉన్నారు, కాసేప సమయం ఇవ్వాలని ఉదయనిధి భార్య కోరినప్పటికీ, పోలీసులు అరెస్ట్ చేశారు.