Reading Time: 2 minutes

Weekend Movies: ఈ వారం బాక్సాఫీస్‌లో అసలైన పోరు.. ఆగస్టు 7న థియేటర్లోకి ఏకంగా 5 సినిమాలు

Caption of Image.

సినీ ప్రేక్షకులకు ఈ వారం మంచి వినోదం అందించేందుకు పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆగస్టు 7న టాలీవుడ్‌తో పాటు తమిళం, కన్నడ, ఇతర భాషల నుంచి విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కామెడీ హారర్, పీరియాడిక్ క్రైమ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్, బయోపిక్, విలేజ్ యాక్షన్ డ్రామా వంటి జానర్లలో వస్తున్న ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఆ సినిమాల విశేషాలు ఇవే.

1. కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి కామెడీ హారర్ జానర్‌లో నటించిన మూవీ ‘కొరియన్ కనకరాజు’. వినోదంతో పాటు హారర్ అంశాలను మేళవిస్తూ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ టైమింగ్‌కు పేరుగాంచిన సత్య కీలక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయన్నది ఇందుకు ఇంట్రెస్టింగ్గా చూపించారు డైరెక్టర్. ఆగస్టు 7న మూవీ రిలీజ్ కానుంది.

2. కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్ (KJQ)

‘దసరా’ చిత్రంతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. స్టైలిష్ విజువల్స్, పవర్‌ఫుల్ కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు KK.. రిలీజ్ కు ముందే చనిపోవడం అత్యంత బాధాకరం. ఇకపోతే, డైరెక్టర్ KK డైరెక్షన్ టీమ్ లో.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వర్క్ చేయడం విశేషం. ఆగస్టు 7న మూవీ రిలీజ్ కానుంది.

3. డీసీ (DC)

‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా ఏంటీ ఇస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీసీ’ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడిగా భారీ విజయాలు సాధించిన లోకేశ్.. నటుడిగా ఎలా మెప్పిస్తారనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.  

4. జి.డి.ఎన్ (GDN)

భారత ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జి.డి.ఎన్’. విజనరీ శాస్త్రవేత్తగా ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భారత పారిశ్రామిక రంగానికి చేసిన సేవలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఆర్. మాధవన్ కీలక పాత్రలో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆగస్టు 7న మూవీ రిలీజ్ కానుంది.

5. అనకాపల్లి

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘అనకాపల్లి’ సినిమా కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ నటుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఆగస్టు 7న మూవీ రిలీజ్ కానుంది.

బాక్సాఫీస్ పోరు గట్టిగానే.. 

మొత్తంగా ఆగస్టు 7న విడుదలవుతున్న ఈ ఐదు చిత్రాలు విభిన్న జానర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కామెడీ హారర్‌ను ఇష్టపడేవారికి ‘కొరియన్ కనకరాజు’, గ్యాంగ్‌స్టర్ డ్రామా అభిమానులకు ‘కేజేక్యూ’, యాక్షన్ థ్రిల్లర్ కోసం ఎదురుచూసేవారికి ‘డీసీ’, స్ఫూర్తిదాయక కథలను ఇష్టపడేవారికి ‘జి.డి.ఎన్’, గ్రామీణ కథాంశాల అభిమానులకు ‘అనకాపల్లి’ మంచి ఎంపికగా నిలవనున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.