Reading Time: < 1 minute
Noida Farmer Rich Land Compensation Helicopter Thailand Trip Modi Government

జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలనో.. లేదంటే లాటరీ అయినా తగలాలనో అంటుంటారు. ఈ మాటలు సరదాగే అనుకున్న కూడా.. నిజంగా జరిగితే మాత్రం లైఫ్ మొత్తం మారిపోతుంది. నోయిడాలో ఓ రైతు జీవితాన్ని మోడీ సర్కార్ మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. అంతేకాకుండా ఓ హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫారిన్ టూర్‌కు కూడా రెడీ అయిపోయాడు. అసలేం జరిగింది? హెలికాప్టర్-మోడీ సర్కార్‌కు ఉన్న లింకేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నిన్నామొన్నటి దాకా ఆ రైతులంతా సాధారణ అన్నదాతలు. ఏదో తమకున్న పొలాల్లో పంటలు పండించుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. అలాంటి కర్షకులకు మోడీ సర్కార్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఉన్నట్టుండి పేద బతుకులు లగ్జరీగా మారిపోయాయి. ఇదంతా కేవలం మోడీ సర్కార్ పుణ్యమా? అని అదృష్టం కలిసొచ్చింది.

శనివారం ప్రధాని మోడీ నోయిడాలో దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా నోయిడాలో మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు పూనుకుంది. అందుకోసం రైతుల దగ్గర పెద్ద ఎత్తున భూములు సేకరించింది. అయితే భూములకు పరిహారంగా అన్నదాతలకు కోట్లలో నగదు ముట్టజెప్పారు. అంతే ఒక్కసారిగా రైతుల దశ మారిపోయింది. లక్షల్లో కాకుండా ఏకంగా కోట్లలో కర్షకులకు డబ్బు అందింది. దీంతో నోయిడా రైతులందరూ భాగ్యవంతులైపోయారు.

ఏకంగా ఒక రైతుకు అయితే రూ.15 కోట్లు అందాయి. దీంతో అతడు ఒక హెలికాప్టర్ కొనుగోలు చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. లబ్ధిపొందిన రైతులు తమ ఆనందాన్ని, సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. నోయిడా ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వడంతో తమ జీవితాలు మారిపోయాయని పలువురు చెప్పుకొచ్చారు.

ఇక ఈ వార్త ప్రస్తుతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు రకరకాలుగా స్పందించారు. ‘‘ఇది శుద్ధ అవివేకం. మహారాష్ట్రలో కూడా ఇలాంటి కేసులు చూశాం. అక్కడ ప్రజలు కూడా పరిహారాన్ని అనేక విలాసవంతమైన కార్ల మీద ఖర్చుపెట్టి రెండేళ్లలోపే ఇంధనం వంటి ప్రాథమిక ఖర్చులకే ఇబ్బంది పడ్డారు. పూణె సమీపంలోని ముల్షి వంటి ప్రదేశాల్లో ఇలాంటి కథలు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో తర్వాతి తరం కూడా నేరాల వైపు మళ్లింది..’’ అని రాసుకొచ్చాడు.