Reading Time: < 1 minute

కొత్త నిబంధన: ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్

Caption of Image.

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ అధికారులు కొత్త నిబంధన తీసుకొచ్చారు.  ఇంటి పన్ను చెల్లించకుంటే కరెంట్ కట్  చేస్తున్నారు.  ఇప్పటికే 90 శాతం ఇంటి పన్ను వసూలు చేసిన మున్సిపల్ అధికారులు 100 శాతం ఇంటి పన్ను వసూలు కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్లు చెప్పారు.

 గృహలక్ష్మి పథకం అమలవుతున్న తమ ఇండ్ల కరెంట్  కట్ చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  గతంలో ఇంటి పన్ను కట్టకుంటే వాటర్ కలెక్షన్ కట్ చేసేవారు అధికారులు . ఇపుడు  కరెంట్ బిల్ బకాయి లేకున్నా ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు అధికారులు. మొండి బాకీ వసూలు చేయడానికి జిల్లా కలెక్టర్  ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో ఆ ఇంటి విద్యుత్, వాటర్ కలెక్షన్లు కట్ చేస్తున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.  కరెంట్ కట్ చేసే పరిస్థితి రాకుండా అందరు సహకరించి ఇంటి పన్నులను చెల్లించాలని పట్టణ ప్రజలను కోరారు కమిషనర్.

కోరుట్ల మున్సిపాలిటీలో ఇంటి పన్ను వసూళ్ల కోసం అధికారులు అవలంబిస్తున్న ఈ కొత్త పద్ధతి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ శాఖకు మాత్రమే ఉంటుంది. మున్సిపల్ పన్ను బకాయిల కోసం కరెంటు కట్ చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.