Reading Time: 2 minutes
Ms Dhoni Ruled Out Of Ipl 2026 Opening Matches Csk Suffers Major Blow

MS Dhoni Ruled Out IPL: ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే అభిమానులకు నిరాశ కలిగించే వార్త వెలువడింది. టీమిండియా లేజం ప్లేయర్, సీఎస్‌కే కీలక ఆటగాడు మిస్టర్ కూల్ ‘ధోని’ ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి రెండు వారాలకు దూరంగా ఉండబోతున్నారు. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీ, టోర్నమెంట్ తొలి రెండు వారాలకు అందుబాటులో ఉండడని ఆఫిసియల్ గా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

సీఎస్‌కే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ధోనీ ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్‌ లో ఉన్నాడని.. దీంతో సీజన్ ప్రారంభ మ్యాచ్‌ లలో జట్టుకు అతని సేవలు దొరకకపోవచ్చునని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్‌ ను మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌ లో ధోనీ లేకపోవడం జట్టుకు కచ్చితంగా పెద్ద లోటే.

April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

ఈ ఏడాది 45 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ధోనీ.. సీఎస్‌కే జట్టులో ఉన్న నలుగురు వికెట్ కీపర్లలో ఒకరు. అతనితో పాటు సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సాధించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, సీఎస్‌కే జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. ధోనీ కోలుకునే ఈ తొలి రెండు వారాల్లో సీఎస్‌కే జట్టు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వార్తతో నిరాశ చెందిన అభిమానులు.. ధోనీ త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.