
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదవంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నయాగఢ్ జిల్లాలోని దసపల్ల తకరఘాటీ దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.