Reading Time: < 1 minute

మెగా డాటర్ నిహారకి కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా మారి తొలి మూవీతో మంచి విజయం సాధించిన నిహారిక.. ప్రస్తుతం తన రెండో చిత్రం రాకాస మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తన మూడో సినిమాను అనౌన్స్ చేశారు. తన సోదరుడు, హీరో వరుణ్ తేజ్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు నిహారిక.

శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి బరి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ యదువంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.