Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమాసి యా సంక్షోభం నేపథ్యం లో లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలపై కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర పెట్రోలి యం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభు త్వం వద్ద లేదని స్పష్టం చేశారు.మంత్రి సీతారామన్ రాజ్యసభలో ఆర్థిక బిల్లు 2026పై చర్చకు సమాధానం ఇస్తూ మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభు త్వం ఆర్థిక లోటును నియంత్రిస్తోందని చెప్పారు. అనేక దేశాలు మోటా ర్ ఇంధనం ధరలు 2ం నుంచి 50 శాతం వరకు పెంచాయని,

కానీ భారత్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా అదుపులో ఉంచగలిగినట్టు వివరించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బంకుల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ఉండేలా ప్రభుత్వం వాటిపై ఎక్సయిజ్ డ్యూటీని రూ. 10 వంతున తగ్గించింది. గతంలో ఎలా ఆర్థిక క్రమశిక్షణ పాటించడమైందో అదే విధంగా పాటిస్తున్నట్టు మంత్రి వివరించారు. పన్నుయేతర ఆదాయాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తరువాత మూజువాణీ ఓటు ద్వారా రాజ్యసభ ఆర్థిక బిల్లును లోక్‌సభకు తిప్పి పంపించింది.

కేంద్ర మంత్రి పురి స్పందన

సామాజిక మాధ్యమ వేదిక ద్వారా కేంద్రమంత్రి పురి ఇంధనం సరఫ రా, నిత్యావసరాలు సరైన సమయంలో అందుబాటులోకి రావడంపై అత్యంత సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇంధ నం, ఇతర అవసరాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.