
హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని,
మరో చేతి పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.