Reading Time: 2 minutes

మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో నేడు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరగనుంది. ఇందుకోసం భద్రాచలం ప ట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రూ. 8 లక్షలతో 40 రకాల పూలతో అందంగా అలంకరించిన మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరగనుంది. భద్రాచలంలో ఈ నె ల 19న వసంతపక్ష తిరుకల్యాణ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా తొలి రోజున అంకురార్పణ నిర్వహించారు. 23న కలశ, యాగశాల అలంకరణ పూజలు, 24న గరుడ ధ్వజ పట మండల లేఖనం, 25న ధ్వజారోహణం, అగ్ని ప్ర తిష్ట నిర్వహించగా గురువారం రాత్రి ఎదుర్కోలు నిర్వహించారు. నేడు శ్రీ సీతారామచంద్రస్వామి వారికి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం లో 40 రకాల పూలతో అలంకరించిన వేదికపై స్వామి వారికి కల్యాణం జరగనుంది. ఇందుకోసం భద్రాచలంను సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దా రు. భక్తులకు అందుబాటులో ఉండేలా సమాచా ర కేంద్రాలు, ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అలాగే భద్రాచలం పట్టణంలో భక్తులకు వివిధ సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత క్లాక్ రూ ములు, అన్నదానం, తాగునీరు, పులిహోర పొట్లా ల పంపిణీ నిర్వహించనున్నారు. కరకట్ట, గోదావ రి పరిసరాల్లో షామియానాలతో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. పట్టణంతో పాటు మిథిలా స్టేడియంలో తాగునీరు సౌకర్యం కల్పించారు. కల్యాణ వేడుకను పురస్కరించుకొని రామాలయానికి ఏర్పా టు చేసిన రంగురంగుల విద్యుత్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టు కుంటోంది. ఈసారి నవమికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ 470 బస్సులను నడుపుతోంది. దేవస్థానంలో భక్తుల రద్దీని త ట్టుకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం 26 సెక్టార్ల లో 31,480 మంది స్వామి వారి కల్యాణం తిలకించేందుకు అవకాశం ఉంది.

ఇందులో 16,480 టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అవకాశం ఉండగా, స్టేడియంలోని గ్యాలరీ ద్వారా 15 వేల మంది స్వామి వారి కల్యాణాన్ని ఉచితంగా తిలకించేందుకు అవకాశం ఉం ది. అలాగే మిథిలా స్టేడియంలో స్వామి వారి క ల్యాణం భక్తులు వీక్షించేందుకు ప్రతీ సెక్టార్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రత చర్యల్లో భా గంగా సీసీ కెమెరాలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు వేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. 250 కూల ర్లు, 50 టన్నుల ఏసీలను, 250 ఫ్యాన్లను ఏర్పా టు చేశారు. అదేవిధంగా కల్యాణంకు తలంబ్రా లు, పట్టువస్త్రాలను సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు సమర్పించనుండగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి వి క్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, సీతక్కలు రానున్నారు.

రెండోసారి తలంబ్రాలు సమర్పిస్తున్న సిఎం

భద్రాచలంలో సిఎం రేవంత్‌రెడ్డి నేడు రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గత ఏడాది ఏప్రిల్ 6న జరిగిన కల్యాణంలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. మరోసారి నేడు భధ్రాచలంకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. సిఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్దమవుతున్నారు.

రూ.351 కోట్లతో రామాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భద్రాచలంలో నేడు రామాలయం అభివృద్ది పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన, భూమిపూజ ని ర్వహించనున్నారు. భద్రాచలంను అభివృద్ది చేసేందుకు రూ.586 కోట్లతో అంచనాలు రూపొందించగా తొలి విడతగా రూ.351 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులను పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సం బంధించిన ఏర్పాట్లను గురువారం మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రామాలయ అభివృద్ధి నమూనా ను ఆవిష్కరించారు.

రెండువేల మందితో పోలీసు బందోబస్తు

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భద్రాచలంలో పోలీసు శాఖ ఆద్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వరంగల్ రేంజి ఐజీ పర్యవేక్షణలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ రోహిత్‌రాజు ఆధ్వర్యం లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ రెం డువేల మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించదు న్నారు. ఇందులో ఇడిషనల్ ఎస్పీలు ఇద్దరితో పాటు 20 మంది వరకు సీఐలు ఉండనున్నారు. అలాగే ఎస్సైలు, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబు ళ్లు, కానిస్టేబుళ్లతో పాటు మహిళా పోలీసు అ ధికారులు, స్పెషల్ పార్టీలు, ఆర్మ్ డ్ రిజర్వుడు సెక్షన్లు, బాంబ్ డిస్పోజబుల్ బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.