
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు మంటల్లో దగ్ధం కావడంతో 14 మంది సజీవ దహనమ య్యారు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో గురువారం తెల్లవారు జామున 66.30 గంటల మధ్య ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. టిప్పర్ చీమకుర్తి నుంచి కంకర్ లోడ్‌తో మార్కాపురం వైపు వెళ్తోంది. ప్రమాదంలో గాయపడ్డ 27 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వా స్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదం తో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రైవేటు బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టా రు.
వేగంగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారు జాము కావడంతో బస్సులో అందరూ నిద్రలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో తమ గమ్యస్థానాలకు వెళ్లే లోపు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన నలుగురు ఉన్నట్లు సమాచారం. జీవనోపాధి కోసం ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు వచ్చి ఇక్కడ గృహ నిర్మాణ పనులు చేస్తుంటారు. ఎపిలోని కనిగిరి, పామూరు వాసులు ఉన్నట్లు తెలిసింది. 3 అగ్నిమాపక వాహనాలతో పోలీసులు మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. మరికొం దరు శుభకార్యాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. స్లీపర్ సీట్లో నిద్రిస్తున్నవారంతా చనిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కొందరు కిటికీ లు బద్దలు కొట్టి బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
బస్సు వెను క భాగంలో ఉన్న వారు బయటకు రాలేక మృతిచెందినట్లు తెలిసింది. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు పది మంది ప్రాణాలతో బయట పడ్డారు. సంఘ టనా స్థలికి అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై మార్కాపురం ఎస్‌పి వి.హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ, మృతుల సంఖ్య 14కు చేరిందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్య లు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్ జగిత్యాల నుంచి పామూరు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. టిప్పర్, బస్సు ఢీ కొనడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వెనువెంటనే బస్‌కు అంటుకున్నాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని మార్కాపురం డిఎస్‌పి నాగరాజు వెల్లడించారు. ప్రమాదం వెనుక సాంకేతిక లోపాలు కూడా ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బస్ కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు మొదట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది యర్రగొండుపాలెం వద్ద గంటసేపు ఆపేసి రిపేర్ చేశారు. అనంతరం ప్రయాణం కొనసాగించారు. ఇది జరిగిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్ సిబ్బందిని విచారించగా స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పినట్టు తెలుస్తోంది.
పలువురిని రక్షించిన బాలరాజు…!
ఈ బస్సు ప్రమాదంలో పలువురిని బాలరాజు అనే వ్యక్తి రక్షించాడు. బస్సు అద్దాలు పగలగొట్టి పలువురు తోటి ప్రయాణికులను బాలరాజు రక్షించాడు. ఈ క్రమంలో అతడికి కూడా గాయలయ్యాయి. ప్రస్తుతం బాలరాజు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. బాలరాజు కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతుని పాడు మండలం తక్కెళ్లపాడు గ్రామనికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.అతడు బస్సు అద్దాలు బ్రేక్ చేయకపోయి ఉంటే మరికొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే వారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం రావడం, క్షణాల్లో మంటలు,
దట్టమైన పొగ బస్సును చుట్టుముట్టాయని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు దూకేశారు. అలానే బాలరాజు అనే ప్రయాణికుడు మరోవైపు బస్సు అద్దాలను పగలగొట్టి కొందరి ప్రయాణికులను బయటకు పంపాడు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు : అంబటి అనిల్ (26), కుమారుడు అంబటి లియో (5 నెలలు), బండారి పద్మ (28), ముత్తంగి వెంకటేశ్వర్లు (45), తమ్మశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ఎన్.ప్రభావతి (36), కత్తి జయరాములు, ఆత్మకో రు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి.
ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం
ఘోర రోడ్డు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆయన అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం తెలుసు కున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడి నవారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని సిఎం చంద్రబాబు అధికారుల ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 14 మంది సజీవ దహనం అయిన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు.
అత్యంత విషాదకరం,
బాధితులకు పరిహారం: ప్రధాని మోడీ
మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇవ్వనున్నట్లు మోదీ స్పష్టం చేశారు.
సిఎం రేవంత్ విచారం..
అధికారులకు కీలక ఆదేశాలు
ఎపిలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనం కావడం పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబా లకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణ లోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించా లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఎపి అధికా రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం చేశారు.