Reading Time: < 1 minute

అమరావతి: ఆరు నెలల కూతురు ఏడుస్తుందని తల్లి పసికందును గొంతు నులిమి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్, హేమ అనే దంపతులు ఎన్ఆర్ అగ్రహారంలో అద్దె ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకటేష్ ఓ ఇటుకల భట్టీలో పనిస్తుండగా భార్య ఇంట్లోనే ఉండి ఆరు నెలల కూతురు, ఐదేళ్ల కుమారుడిని చూసుకుంటుంది. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆకలితో కూతురు ఏడుస్తుండడంతో భార్యను లేపాడు. అనంతరం పనికి వెళ్తున్నానని చెప్ప బయటకు వెళ్లాడు. కూతురు అలాగే ఏడుస్తుండడంతో గొంతు నులిమి భార్య కన్నబిడ్డను చంపేసింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తనకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ అని జరిగిన సమాచారం చెప్పింది. వెంటనే తండ్రి ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.