Reading Time: < 1 minute

కర్మన్‌ఘాట ప్రాంత ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌ను ఆదరిస్తారని తనకు ఎంతో నమ్మకుం ఉందని ప్రముఖ సినీ నటి శ్రీలీల అన్నారు. శుక్రవారం ఆమె కర్మన్‌ఘాట్‌లో మాంగళ్యషాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాల్‌లోని పలు కలెక్షన్లను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజక వర్గంలో ఈ మాల్‌ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీని ప్రారంభంతో పలువురు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి వర్గానికి ,ప్రతి సందర్భరానికి అనువైన ,నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ధరల్లో అందిండమే మా విజయరహస్యమని సంస్థ నిర్వహకులు పేర్కొన్నారు.అంతే కాకుండా తమ సొంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేస్తూ వస్త్రవ్యాపారంలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. రూ ః 99 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు విస్తరించిన ధరలో శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో మాంగళ్య సంసూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందినట్లు తెలిపారు..2012లో వరంగల్‌లో ప్రారంభమైన తమ సంస్థ నూతన ఒరవడిని సృష్టిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్న తమ సంస్థను ఆయా రాష్ట్రాల్లో 9 నుంచి 10 ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని, భవిష్యత్తుల్లో తమిళ నాడులో కూడా తమ ప్రాజెక్టులను ప్రారంభించనన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్లు పుల్లూరి నరసింహమూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లిఖార్జున్, కాసం శివ ప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్, పాషింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.