
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ గతేడాది ‘లైలా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సప్ట్ సినిమా అయినప్పటికీ.. అది ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేకపోయింది. దీంతో సరైన హిట్ కోసం విశ్వక్ ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ దర్శకుడు కెవి అనుదీప్ డైరెక్షన్‌లో విశ్వక్ ‘ఫంకీ’ అనే సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీరాములు థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.
The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥
Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad.
Join us for pure FUNKY MADNESS 😎🔥In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL
— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026