Reading Time: < 1 minute

హరారే: అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 80 బంతుల్లనే 15 ఫోర్లు, 15 సిక్సులతో 175 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కి వచ్చింది. అయితే 20 పరుగుల వద్దే ఆరోన్ జార్జి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వైభవ్, కెప్టెన్ ఆయుష్ మాత్రేలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రెండో వికెట్‌కి 142 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో వైభవం 55 బంతుల్లో సెంచరీ సాధించగా.. మాత్రమే 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి వేదాంత్ కూడా రాణించాడు. అయితే 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. అభిజ్ఞాన్ కుందు (40), విహాన్ మల్హోత్రా (30) ఫర్వాలేదనిపించారు ఆఖర్లో కనిష్క్ చౌహాన్(37) మెరుపులు మెరిపించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో జేమ్స్ మింటో 3, సెబాస్టియన్, అలెక్స్ గ్రీన్ చెరి రెండు, మాన్నీ 1 వికెట్ తీశారు.