Reading Time: < 1 minute

లక్నో: టీమిండియా బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ గురైంది. ఫేస్‌బుక్ మోనిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని హ్యాకర్లు తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రింకు సింగ్ సోదరుడు సోనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైన మోసం జరిగిందా?, ప్రముఖ ఆటగాడు కావడంతో హ్యాక్ చేశారా? అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం రింకు సింగ్ టి20 ప్రపంచ కప్‌ కోసం బ్యాటింగ్  ప్రాక్టీస్ చేస్తున్నాడు. టీమిండియా తుది జట్టులో అతడి స్థానం పదిలంగా ఉంది.