
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించింది. కీలక వడ్డీ రేట్లలో మార్పులేదని ఆర్‌బిఐ వెల్లడించింది. రేపోరేటు యథాతథం 5.25 శాతంగా ఉంచామని పేర్కొంది. దేశ జిడిపి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని తెలిపింది. డిసెంబర్ లో జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.50% నుండి 5.25% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం చాలావరకు నియంత్రణలో ఉందని, అయితే వృద్ధి సూచికలు మిశ్రమ సంకేతాలను చూపిస్తున్నాయి. ఆర్‌బిఐ మానిటరీ పాలసీ నిర్ణయం మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురి చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు హోమ్ లోన్లు, కారు లోన్లు నుంచి ఇఎంఐల భారం తగ్గుతుందని ఆశించిన జనాలకు ఆర్‌బిఐ నిర్ణయం షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 5.25 శాతం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నుంచి ఆర్‌బిఐ 125 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును తగ్గించింది, కానీ ఈ సారి యథాతథం అని చెప్పడంతో సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతంతో పటిష్టంగా ఉన్నప్పటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఆర్థిక స్థిరత్వానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆహారేతర వస్తువుల ధరలు పెరుగుదలపై నిఘా ఉంచడంతో రూపాయి విలువలో హెచ్చతగ్గులతో ఆరబిఐ అప్రమత్తమైంది.