
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర డిజిపి నియామ కం పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశా లు జారీ చేసింది. రాష్ట్రంలో డిజిపి శాశ్వత నియామకాన్ని నాలుగు వారాల్లో చేపట్టాలని గురువారం యు పిఎస్‌సి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిపి ని యామక ప్రక్రియపై హైదరాబాద్‌కు చెందిన ధనగోపా ల్‌రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం విచారించిం ది. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. గతేడాది తెలంగాణ డిజిపి బి.శివధర్‌రెడ్డిని యామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది. డిజిపి నియామక ప్రక్రియలో అధికారుల మెరిట్ ఆధారంగా సిఫారసులు చేయాలని ధర్మాసనం పేర్కొంది. సకాలంలో యుపిఎస్‌సికి ప్రతిపాదిత డిజిపి పేర్లను పంపడంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.
దీని వల్ల మెరిట్ ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతోందని, తాత్కాలిక డిజిపి పేరుతో పూర్తిస్థాయి డిజిపిని నియమించడం లేదని చెప్పింది. రాష్ట్రాలు ప్రతిపాదనలు ఆలస్యం చేస్తే త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆయా రాష్ట్రాలకు యుపిఎస్‌సి లేఖ రాయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సకాలంలో పంపకపోతే కమిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యతగా వ్యవహరించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర డిజిపిగా బి. శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నియామకం చెల్లదని, జీఓను కొట్టేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ధనగోపాలరావు అనే వ్యక్తి గతేడాది అక్టోబరు 10న రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా డిజిపి నియామకంలో సుప్రీం కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రకాశ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిజిపి నియామకంపై సుప్రీం కోర్టు స్పష్టమయిన మార్గదర్శకాలు జారీ చేసిందని, దీని ప్రకారం డిజిపి తాత్కాలిక పద్దతిలో నియమించడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు డిజిపిగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన జీఓ కొట్టివేతకు నిరాకరించింది. కానీ, డిజిపి ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో పూర్తి స్థాయి నియామకం చేపట్టాలని అటు యుపిఎస్‌సిని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.