
సామూహికంగా రూ.46 లక్షల రివార్డు ఉన్న మొత్తం 12 మంది మావోయిస్టులు బీజపూర్ జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారని ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు. సౌత్ సబ్ జోనల్ బ్యూరో మావోయిస్టులకు చెందిన వీరిలో ఎనిమది మంది మహిళలు ఉన్నారు. బస్తర్ పోలీసులు అమలు చేస్తున్న “పునరావాసం, సామాజిక జీవన అనుసంధానం” విధానానికి ఆకర్షితులై వారు స్వచ్ఛందంగా లొంగిపోయారని చెప్పారు. వీరు తమ వద్ద ఉన్న ఎకె47 రైఫిల్, రెండు సెల్ఫ్‌లోడింగ్ రైఫిళ్లు, 250 జిలటిన్ స్టిక్స్, 400 డిటొనేటర్స్, గన్‌పౌడర్‌తో నిండి ఉన్న ప్లాస్టిక్ డ్రమ్, కార్డెక్స్ వైర్, అప్పగించారని పోలీసు అధికారులు వివరించారు. లొంగిపోయిన వీరందరికీ రూ.50 వేలు వంతున తక్షణ సాయం అందిస్తామని, తదుపరి పునరావాసం కల్పిస్తామన్నారు. 2024 జనవరి 1 నుంచి బీజపూర్‌లో 888 మంది హింసామార్గం విడిచిపెట్టి జనజీవన స్రవంతి లోకి చేరారు.