
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లు మొదట తడబడినా.. తర్వాత పుంజుకుని మంచి ఆరంభాన్ని అందించారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో ఇద్దరు ఓపెనర్లు పెవిలయన్ కు చేరారు. ముఖ్యమంగా లీ భారీ షాట్లతో ఆర్సీబి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. దీంతో 7.3 ఓవర్లలో ఢిల్లీ 72 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు 9 ఓవర్లలో 83 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో జెమీమా(8), వోల్వార్ట్(11)లు ఉన్నారు.