
న్యూఢిల్లీ: భారతీయ వైమానికదళం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఐదు తేజస్‌మార్క్ 1ఏ ఫైటర్ విమానాలను సిద్దం చేసింది. మరో 9 విమానాలు అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ఇంజిన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. భారతీయ వైమానిక దళంకోసం హెచ్‌ఎఎల్ సంస్థ 180 యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఇవి మార్చి 2024 నాటికే డెలివరీకి సిద్ధం కావలసి ఉండగా, ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల తయారీలో జాప్యం జరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
2021 ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వశాఖ 83 తేజస్ జెట్ విమానాల కోసం హెచ్‌ఎఎల్‌తో రూ.48,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జిఇ ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల డెలివరీ ఆలస్యమవుతోంది .