Reading Time: < 1 minute

ఒప్పొ ఇండియా రెనో15 సిరీస్‌లో కొత్తగా రెనో15సిని విడుదల చేసింది. ఈ ఫోన్ ఈ నెల 5 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో లభ్యమవుతుంది. 7000ఎంఎహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే, 50ఎంపి కెమెరాలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్1 ప్రాసెసర్‌తో వస్తుంది. ధర రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు, కంటెంట్ క్రియేటర్లకు ఇది సరైన ఫోన్ అని ఒప్పొ తెలిపింది.