Reading Time: < 1 minute

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న స్పోర్ట్ ఫ్యామి లీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ – ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్‌లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు. గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర సృష్టించిన క్యారెక్టర్‌కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్‌లా నిలుస్తుంది. శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా డేరింగ్, డాషింగ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.