Reading Time: < 1 minute

హైదరాబాద్: తాను మీడియాలోకి వచ్చేసరికి హీరో చంద్రహాస్ డైపర్లతో ఉన్నాడని జర్నలిస్టు అశోక్ తెలిపారు. చంద్రహాస్ బెదిరింపులకు భయపడేది లేదని అంటూ జర్నలిస్ట్ అశోక్ నటుడు చంద్రహాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకు లాయర్లు ఉంటే నాకూ ఉన్నారు, లీగల్‌గానే ఎదుర్కొంటా’ అని సవాల్ విసిరారు. బూతు పాటలపై సమాజానికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రహాస్ అని చురకలంటించారు. ఆటిట్యూడ్ మార్చుకుని సినిమాపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. సోషల్ మీడియాలో సదరు హీరోపై వస్తున్న విమర్శలను గమనించి కెరీర్‌ను చక్కదిద్దుకోవాలని అశోక్ సలహా ఇచ్చారు. 

ఆ పాట పాడినందుకు తాను బాధపడటం లేదని హీరో చంద్రహాస్ తెలిపారు. తాను ఎవరికీ సారీ చెప్పనని, ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదన్నారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చెప్పారు. ఎన్ని సినిమాల్లో బీఫ్ సౌండ్ వాడరని చంద్రహాస్ ఎదురు ప్రశ్నించారు. 

‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుక సందర్భంగా చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాట పాడారు. మహిళలు ఉన్నారని చూడకుండా బూతుపురాణంతో పాటపాడారు. సీనియర్ నటుడు జెడి చక్రవర్తి సమక్షంలోనే వికృత చేష్టలకు పాల్పడ్డాడు.  సెన్సార్ అభ్యంతరంతో సినిమాలో ఈ పాట ఉండదని హీరో చెప్పారు. చంద్రహాస్ వివాదాస్పద పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తెలుగు సినిమాను బి గ్రేడ్ స్థాయికి తీసుకెళ్తున్నారా? అని నెటిజన్లు చంద్రహాస్ పై మండిపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష పరువు తీశాడని, సినీ పెద్దల సమక్షంలో ఇలాంటి పాటలు పాడటం దురదృష్టకరమని అనిల్ నెటిజన్ దుయ్యబట్టారు. నటుడు శివాజీ ఒక మాట అన్నందుకు ఆయనతో ఒక గొప్ప సినిమా తీసి నిర్మాతలు నష్టపోయారు. చంద్రహాస్ పిల్ల బచ్చా గాడివి కాబట్టి నిన్ను కన్న తల్లిదండ్రులను అంటారని, భవిష్యత్తు ఉన్న వాడివి ఇలా అందరి దగ్గర నెగిటివ్ పేరు తెచ్చుకుంటే రేపు నీ సినిమా ఎంత బాగున్నా నష్టపోయేది నిర్మాతలేనని కృష్ణా రెడ్డి అనే నెటిజన్ కామెంట్ చేశారు.