
హైదరాబాద్: సినీ నటుడు చంద్రహాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాలో చంద్రహాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుక సందర్భంగా చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాట పాడారు. హీరో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని బిగ్ టివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. చంద్రహాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సదరు జర్నలిస్టు బెదిరిస్తూ పోస్టు చేయడంతో అతడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీరియల్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ కావడం గమనార్హం.
సీనియర్ నటుడు జెడి చక్రవర్తి సమక్షంలోనే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మహిళలు ఉన్నారని చూడకుండా అసభ్యపదజాలంతో చంద్రహాస్ పాటపాడారు. సెన్సార్ అభ్యంతరంతో సినిమాలో ఈ పాట ఉండదని హారో చెప్పారు. చంద్రహాస్ వివాదాస్పద పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తెలుగు సినిమాను బి గ్రేడ్ స్థాయికి తీసుకెళ్తున్నారా? అని నెటిజన్లు చంద్రహాస్ పై మండిపడుతున్నారు.
బిగ్ టి అదిలాబాద్ సౌజన్యంతో వీడియో