
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయు డు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్ -డ్రామా ’మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. టీం బుధవారం టీజర్‌ను లాంచ్ చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ కు అతిధిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ “టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా రవితేజ ఫాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు”అని అన్నారు. హీరో మాధవ్ మాట్లాడుతూ “నాగరాజు టీజర్‌ని అద్భుతంగా చూపించారు. ఈ స్క్రిప్ట్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ “సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఇం దులో చూపించిన మైసాపురం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కథ మా ఊరిలో కూడా జరిగింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని తెలియజేశారు. ఈ కా ర్యక్రమంలో హీరోయిన్ దీపా, వికాస్ వశిష్ట, కుశాల్ రెడ్డి పాల్గొన్నారు.