Reading Time: < 1 minute

శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ‘. ఈ చిత్రంలో మాదాల రంగారావు మనవడు, మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం మొదటి టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ విడుదల చేశారు. అనంతరం పరచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ “తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ‘ఓ టార్చర్ ప్రేమ‘ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు”అని అన్నారు.