Reading Time: < 1 minute

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి.. వారణాసి సినిమాను అవతార్ తో పోల్చడంపై మాట్లాడుతూ.. “జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ ఆయన ఒక శిఖరం లాంటివారు. నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థిని. ఇక వారణాసి నిడివి 3 గంటల 20 నిముషాలు ఉంటుంది. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టాలి. 3 నిముషాలు బోర్ కొట్టించినా ప్రేక్షకుడు ఫోన్ పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా తెరకెక్కిస్తున్నాం. ప్రతి సీన్ కొత్త అనుభూతినిస్తుంది’ అని చెప్పారు.